తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన చిత్తూరు రూరల్ సీఐ శ్రీధర్ నాయుడు.
తవణంపల్లి ఏప్రిల్ 28 ప్రజావాణి : తవణంపల్లి మండల కేంద్రంలోని తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను చిత్తూరు రూరల్ సీఐ శ్రీధర్ నాయుడు మంగళవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులు, ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్లు, పెండింగ్ కేసులను సమీక్షించారు. అనంతరం బాధితుల వినతులను స్వీకరించాలని, కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. మరియు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై రమేష్ బాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.