తల్లిదండ్రుల ఆవేదనకు స్పందించండి..<br>నా బిడ్డను కాపాడండి ఆపరేషన్ కు ఆర్థిక సాయం చేయండి
మంథని: మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి చెందిన అనసూయ, సత్యనారాయణ దంపతుల కుమారుడు చందు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులను సంప్రదించగా, కడుపులోని పేగులు ఒకదానిపై ఒకటి మడతబడినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.ఇప్పటికే ఆపరేషన్ కోసం కుటుంబ సభ్యులు అప్పులు చేసి వైద్యం చేయించారు. అయితే చందుకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించడంతో, ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో ఆపరేషన్ చేయించేందుకు అవసరమైన డబ్బులు...