prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:17 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

తల్లిదండ్రులు జ్ఞాపకార్థం క్రికెటర్లకు జెర్సీలు పంపిణీ

ఎండపల్లి మండలం రాజరాంపల్లికి చెందిన సుధమల్ల వంశీ, విష్ణు లు తమ స్వర్గీయ తల్లిదండ్రులు సుధమల్ల లక్ష్మి – చిన్నయ్య ల జ్ఞాపకార్థం స్థానిక యువ క్రికెటర్లకు ఈ రోజు జెర్సీలను పంపిణీ చేశారు. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వారు చేసిన ఈ వితరణ పై ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత సన్మార్గంలో నడుస్తుందని పేర్కొంటూ వంశీ, విష్ణులను స్థానికులు ఎంతగానో అభినందించారు.