prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 7:29 am Digital Edition : ASHOK THIRUPATHI

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం

 

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి.

 

*నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి.*

 

తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి ఎన్టీఆర్ తాగునీరు ఇచ్చారు.

 

తిరువళ్ళూర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డ నుంచి వచ్చారు

 

తమిళనాడుతు చెందిన ఎంతో మంది ఉన్నతాధికారులు దేశానికి సేవ చేశారు, చేస్తున్నారు.

 

తమిళ ప్రజలకు వారి భాష అంటే ఎంతో ప్రేమ, కష్టించి పని చేసే మనస్తత్వం వారిది.

 

ఏపీ తమిళనాడు రాష్ట్రాల ప్రజలది అన్నదమ్ముల బంధం.

 

ఘనమైన వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం తమిళనాడు.

 

మన దేశానికి ఓ సంస్కరణ వాది ప్రధానిగా ఉన్నారు.

 

రాష్ట్రాల మధ్య అభివృద్ధి పోటీ ఉంది. దీనికి కేంద్ర ప్రోత్సాహం కూడా ఉంది

 

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని కాంగ్రెస్, డీఎంకే అంటున్నాయి.

 

కానీ వారు మహిళలను ఓడించారు.

 

నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు.

 

కొత్త సెన్సస్ ప్రకారం అయితే దక్షిణాది నష్టపోవాల్సి వచ్చేది.

 

ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం అదనంగా సీట్ల సంఖ్య పెరిగితే దానిపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చేవి.

 

దీనికన్నా మంచి ఫార్ములా మరొకటి ఉంటుందా..?

 

మహిళలకు, పురుషులకు దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేదు.

 

బిల్లులను అడ్డుకున్న రాహుల్ గాంధీ, స్టాలిన్ లు ఏం సాధించారు.

 

నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నాను.

 

జాతీయ ప్రయోజనాలతో పని చేస్తున్న ప్రధానికి మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం.

 

తమిళనాడులో అభివృద్ధి ఆగింది. చెన్నై లాంటి నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

 

శాంతి భద్రతలు, మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు, డ్రగ్స్ పెరిగాయి.

 

చెన్నై రైల్వే స్టేషన్ ఆధునీకరణకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు.

 

త్వరలో చెన్నై బెంగుళూరు అమరావతి లాంటి నగరాలను అనుసంధానించే లా హై స్పీడ్ రైలు కారిడార్ ను కేంద్రం ఆమోదుంచింది.