తప్పిపోయిన దివ్యాంగుడు అఖిల్ ను తల్లి ఒడికి చేర్చిన జవహర్ నగర్ పోలీసులు

పదిహేను రోజుల క్రితం తప్పిపోయిన దివ్యాంగుడు అఖిల్ ను తల్లి ఒడికి చేర్చిన జవహర్ నగర్ పోలీసులు. జవహర్ నగర్, ఆగస్టు 8 (ప్రజావాణి ప్రతినిధి) గత నెల 26వ తేదీ ఆదివారం రోజు అంబేద్కర్ నగర్ లోని తన నివాసం నుండి బయటికి వెళ్లిన అఖిల్ కనబడకుండా పోవడంతో తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు వార్తా పత్రికలు, చానల్లలో వచ్చిన కథనానికి స్పందించిన జవహర్ నగర్ ఠాణా సీఐ సైదులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి...