తప్పిన ప్రమాదం సర్పంచ్ చొరవతో అదుపులోకి భారీ మంటలు
తప్పిన ప్రమాదం.. సర్పంచ్ చొరవతో అదుపులోకి భారీ మంటలుకామంచికల్, జూన్ 4: కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వెంచర్‌లో గురువారం భారీ మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ బొప్పి ప్రభాకర్ రావు వెంటనే స్పందించి, గ్రామపంచాయతీ ట్యాంకర్‌ను ఘటనాస్థలికి పంపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.సకాలంలో చేపట్టిన చర్యలతో మంటలు మరింత విస్తరించకుండా అరికట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా తప్పినట్లు స్థానికులు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ బొప్పి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, రైతులు పొలాలు,...