తన వద్దకు రావడం లేదన్న కోపం.. మహిళపై కత్తిపోట్లతో హత్యాయత్నం.

నేరేడుచర్ల, ప్రజావాణి జూన్ 23: నేరేడుచర్ల పట్టణానికి చెందిన తాళ్ల కాశమ్మ (55), భర్త కోటేశ్వరరావు, అనే మహిళపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం, నేరేడుచర్లకు చెందిన షేక్ సుభాన్‌తో కాశమ్మకు కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మిర్యాలగూడలో అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. అయితే కాశమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత రెండు నెలలుగా సుభాన్‌ను విడిచి నేరేడుచర్లలో తాను దత్తత తీసుకున్న కుమారుడి వద్ద నివసిస్తోంది. ఈ నేపథ్యంలో కాశమ్మ తన...