తంగళ్ళపల్లిలో నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహణ

తంగళ్ళపల్లిలో నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహణ ప్రజావాణి//తంగళ్ళపల్లి, మార్చి 2: తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శుభోదయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు నేషనల్ సైన్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో సైన్స్ పాత్ర అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి తంగళ్ళపల్లి సర్పంచ్ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన...