ఢిల్లీలో డి రిజిస్టర్ చేసిన వాహనాల కొనుగోలు పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తిరుపతి జిల్లా రవాణా శాఖ హెచ్చరిక
తిరుపతి 17-07-2026ఢిల్లీలో డీ-రిజిస్టర్ చేసిన వాహనాల కొనుగోలుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఒక వాహనం స్వాధీనం.– తిరుపతి జిల్లా రవాణా శాఖ హెచ్చరిక**ప్రజలు పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ విజ్ఞప్తి చేస్తోంది.ఇటీవల ఢిల్లీలో డి-రిజిస్టర్ (De-Registered) చేయబడిన వాహనాలను కొందరు వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు తీసుకువచ్చి, నకిలీ లేదా తప్పుడు పత్రాల ఆధారంగా చట్టబద్ధమైన వాహనాలుగా చూపిస్తూ విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.డి రిజిస్టర్ అయిన ఢిల్లీ వాహనాన్ని మోటార్ వాహనాల తనిఖీ అధికారి...