prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 5:34 pm Digital Edition : ASHOK THIRUPATHI

డ్రోన్ కెమెరా కన్ను పడింది కోడిపందెం రాయల్లా ఆట కట్టింది

డ్రోన్ కెమెరా కన్ను పడింది కోడిపదేం రాయల ఆట కట్టింది

మన ప్రజావాణి
అన్నమయ్య జిల్లా

అన్నమయ్య జిల్లాలో ఎక్కడైనా ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారి పైన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మరియు డి.ఎస్.పి మహేంద్ర ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కోడిపందెం రాయుళ్ల ఆట కట్టిస్తున్నారు. చౌడేపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయకొండ సమీపంలో ఒక ప్రైవేటు భవనం పక్కనున్న మామిడి తోటలో కోడిపందెం ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న డి.ఎస్.పి మహేందర్ డ్రోన్ కెమెరా సహాయంతో వారిని పట్టుకున్నారు. డ్రోన్ సహాయంతో కోడి పందెం ఆడుతున్న ప్రదేశాన్ని ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిగా ఉంచిన పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. ఎక్కడికి పారిపోలేక 13 మంది పందెం రాయుళ్లు పోలీసులకు చిక్కారు. వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

13 మంది కిడిపందెం రాయలు
11 స్కూటర్లు
25 వేల రూపాయల నగదు
6 పందెం కోళ్ళు స్వాధీనం పరుచుకున్నారు .

ఈ ఘటనపై చౌడేపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు . ఈ ఘటనపై చౌడేపల్లి మండల ఎస్ ఐ మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.