డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు: నేరేడుచర్లలో పోలీసుల అవగాహన కార్యక్రమం

డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి – ఎస్‌ఐ పిలుపు నేరేడుచర్ల, ప్రజావాణి జూన్ 12 : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్‌ఐ మాట్లాడుతూ, సమాజం నుంచి డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం కారణంగా యువత, విద్యార్థులు...