డ్రగ్స్, గంజాయి మాఫియా ను అరికట్టాలి. డివైఎఫ్ఐ
ప్రజావాణి న్యూస్(మార్చి17) పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డివైఎఫ్ఐ,ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో డ్రగ్స్,గంజాయి పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డ్రగ్స్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు చిన్ని,వీరణాల.శివకుమార్ ఐద్వాసంఘం జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ బేగం తెలిపారు.జన చైతన్య జీపు జాతా బద్వేలు లో ప్రారంభమై పోరుమామిళ్ళ కు చేరుకుంది.ఈ సందర్భంగా చిన్ని,శివకుమార్,ఐద్వా జిల్లా నాయకురాలు గౌసియా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై విచక్షణ కోల్పోయి ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు అన్నారు....