prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 11:55 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

డ్రగ్స్,గంజాయి మూకలను అరికట్టాలి,ప్రజలకు రక్షణ కల్పించాలి. డివైఎఫ్ఐ

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్07)జిల్లాలోడ్రగ్స్,గంజాయి మూకలను అరికట్టాలి,ప్రజలకు రక్షణ కల్పించాలి.డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాల వాడుకల పై పోలీసులు ఉక్కు పాదం మోపాలి.డివై ఎఫ్ఐజిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్.డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పద్ధతులను అరికట్టాలని,వాటిని వాడే వారిపైన ఖటిని చర్యలు చేపట్టాలని,గంజాయి మూకల నుండి ప్రజలకు రక్షణ కల్పించి పోలీసులు నిరంతర పర్యవేక్షణ చేయాలని,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు.మంగళవారం నాడు జమ్మలమడుగు లో స్థానిక ఎన్జీవో కార్యాలయం నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో,జిల్లా లో రోజు రోజుకు గంజాయి మూకల దాడులు,హత్యలు పెట్రేగి పోతున్నాయని అన్నారు.ఒకవైపు ప్రభుత్వం,పోలీసు యంత్రాంగం గంజాయి,డ్రగ్స్ పదార్థాలను వాడే వారిపై కటినంగా ఉంటామని వాటిని కూకటివేళ్లతో తీసివేస్తామని మాటల వరకే పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు.నెల్లూరు లో పెంచలయ్య హత్య సంచలనం మరువక ముందే ఉప్పు ఎదేచ్చన ఆసుపత్రి ఆవరణలోనే సోమవారం నాడు కడప లో గంజాయి బ్యాచ్ హత్య చేశారంటే ఏ స్థాయిలో ఉన్నారో అర్థం అవుతున్నది అన్నారు.ముఖ్యంగా జిల్లా లో విపరీతంగా గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువ అయ్యాయన్నారు.వీటి నియంత్రణ చాలా అవసరం అన్నారు.ప్రజలు గంజాయి మూకల వలన భయబ్రాంతులకు గురవుతున్నారు అన్నారు.జిల్లా లో గంజాయి వాడకాల పై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని గంజాయి బ్యాచ్ లపై కటిన చర్యలు చేపట్టాలని రాజకీయ పార్టీల నేతల అండ చూసుకుని గంజాయి బ్యాచ్ పెట్రేగి పోతున్నారాణి అటువంటి వారిని ఆయా రాజకీయ పార్టీల నుండి నేతలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.సమావేశంలో పట్టణ కార్యదర్శి తులసిశ్వర్,నాయకులు,మహేష్,రాము పాల్గొన్నారు.