డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి – యువతకు ఎస్సైల సూచన
ఘట్‌కేసర్ మే 25 (ప్రజావాణి): ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 267వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లు బి. ప్రభాకర్ రెడ్డి, ఎ. రాఘవేందర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై బి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి “విద్యను అభ్యసించండి, చైతన్యంతో...