డొక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఎంఎటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 29)పోరుమామిళ్ల: అన్నదానం ద్వారా అపారమైన సేవచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావురాలు డొక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు మదర్ థెరెసా ఫౌండేషన్ (MTF) ఆధ్వర్యంలో ఎంటిఎఫ్ కాంటీన్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమం ప్రారంభంలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతినిధులు డొక్కా సీతమ్మ గారు ఆకలితో బాధపడుతున్న వారికి అన్నం పెట్టడం ద్వారా మానవతా విలువలను ప్రపంచానికి చాటి చెప్పారని...