డీఏ బకాయిలు విడుదల చేయాలి

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన చిగురుమామిడి (మన ప్రజావాణి ప్రతినిధి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ (తెలంగాణ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ పెన్షనర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) డిమాండ్ చేసింది. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ముద్దసాని రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు...