prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 2:15 am Digital Edition : ANIL CHIGURUMAMIDI

డిప్యూటి తహసీల్దార్ స్వరూపరాణికి తహసిల్దార్‌గా పదోన్నతి

 

చిగురుమామిడిలో 15 నెలలపాటు డిప్యూటీ తహసీల్దార్ గా సేవలు

ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల డిప్యూటీ తహసిల్దార్ తాడ స్వరూపరాణికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తహసిల్దార్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా చిగురుమామిడి తహసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో ఆమెకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ…

డిప్యూటీ తహసిల్దార్‌గా స్వరూపరాణి ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను, కర్తవ్యనిష్ఠను కొనియాడారు. చిగురుమామిడి మండలంలో సుమారు 15 నెలల పాటు విధులు నిర్వర్తించి ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందించారని ప్రశంసించారు.పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించి, నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐలు తారా దేవి, నాగరాజు, జీపీఓలు రమేష్ రెడ్డి, మహమ్మద్ రఫీ, రాములు, కొమురయ్య, శ్రీనివాస్, బాలయ్య, బాలరాజు, ఆంజనేయులు, రాజబాబు, అనిత, భగవాన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.