prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:16 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

డిపిఆర్ఓ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ యాదన్నకు ఘన వీడ్కోలు!

*డిపిఆర్ఓ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ యాదన్నకు ఘన వీడ్కోలు!*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) కార్యాలయంలో 31 సంవత్సరాల పాటు రికార్డు అసిస్టెంట్‌గా సేవలందించిన యాదన్న పదవీ విరమణ సందర్భంగా ఆదివారం అక్షర గార్డెన్ లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) వెంకటేశ్వర్లు హాజరై యాదన్న అందించిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధతతో పనిచేసి కార్యాలయానికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు శాటిలైట్, ప్రింట్ & ఎలక్ట్రానిక్, జర్నలిస్టు మిత్రులు యాదన్నను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తు జీవితం సుఖశాంతులతో సాగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది, జర్నలిస్టులు, సన్నిహితులు పాల్గొని యాదన్నకు భావోద్వేగ వీడ్కోలు పలికారు.