prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 9:17 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

డిపార్ట్మెంట్ ఆఫీసర్ పై దాడి చేసిన ప్రిన్సిపల్ ఇందిర ను వెంటనే సస్పెండ్ చేయాలి;బహుజన సమాజ్ పార్టీ

ప్రజావాణిన్యూస్:(మార్చి14) కడప జిల్లా పెండ్లిమర్రి జూనియర్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫీసర్ పై దాడిచేసిన ప్రిన్సిపల్ ఇందిర పై వెంటనే ఎస్.సి, ఎస్.టి అల్ట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సగిలి గుర్రప్ప డిమాండ్ చేశారు.కడప జిల్లా పెండ్లిమర్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న భూత లింగేశ్వర రావు గారిపై అదే కళాశాల ప్రిన్సిపల్ ఇందిర దాడిచేసి కులం పేరుతో దూషించడం దారుణమన్నారు.పరీక్షల విధులలో ఉన్న అబ్జార్వర్ ఎస్.టి కులానికి చెందిన వారు కావడంతో అగ్రవర్ణాలకు చెందిన ప్రిన్సిపల్ ఇందిర దాడిచేయడం హేయమైన చర్య అని వారు తెలిపారు. దాడి జరిగి పది రోజులు అవుతున్నా ఇంతవరకు ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు ప్రిన్సిపల్ ఇందిరా కు వాత్తాసుపలుకుతూ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. గతంలో కూడా ప్రిన్సిపల్ ఇందిర కళాశాలలో లెక్సరర్స్ పై, విద్యార్థులపై దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు.అయినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు స్పందించి ప్రిన్సిపల్ ఇందిరా ను సస్పెండ్ చేసి,ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.