డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బూరుగడ్డ పుష్పనగేష్ యాదవ్
రామచంద్రపురం, జూలై 8(ప్రజావాణి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రజాహిత పథకాలను అమలు చేసి, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.