prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 3:57 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరగనివ్వకుండా దళితులపై బైండోవర్ కేసులు

ఏలూరు జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13) లింగపాలెం మండలం సుందర్రావుపేట గ్రామంలో ఇటీవల కాలంలో మాజీ ప్రధాని స్వతంత్ర సమరయోధులు గౌరవ శ్రీ బాబు జగ్జీవన్ రావు. మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. విగ్రహాలు ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసినదే,అయితే కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు ఆ విగ్రహాలు అక్కడ ఉండటానికి వీలు లేదంటూ ఆ గ్రామంలో ఉన్న దళితులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు తెల్లవారితే అంబేద్కర్ జయంతి వేడుకలు జరగకుండా ఆపడానికి కొంతమంది అగ్రకులాలకు చెందిన వ్యక్తులతో కొంతమంది కలిసి అంబేద్కర్ మరియు బాబు జగజ్జివన్ రావు విగ్రహాలకు రాజకీయ రంగు పులిమి దేశ నాయకులు విగ్రహాలకు పూలమాలలు వేయకూడదు అంటూ అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటూ కొంతమంది దళిత గ్రామస్తులు నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది అయితే చింతలపూడి నియోజకవర్గానికి దళిత ఎమ్మెల్యే ఉండగా దళితులపై ఇటువంటి ఇబ్బందులకు గురి చేయటం సరి కాదని ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగలేదని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ఆ గ్రామంలో ఉన్న సమస్యను సరిచేసి దళితులపై ఎటువంటి కేసులు దాడులు ఏమీ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యం కాపాడాలని ప్రజల కోరుకుంటున్నారు.ఈ విషయంపై దళిత సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్పందించి ఈ అవమాన సంఘటనను ఖండించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు