డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళులు అర్పించిన ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి
గారు బద్వేలు నియోజకవర్గం, పోరుమామిళ్ల మండలం, పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య వంటి విలువలను సమాజానికి అందించి మార్గదర్శకుడిగా...