prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 8:00 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళులు అర్పించిన ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

గారు

బద్వేలు నియోజకవర్గం, పోరుమామిళ్ల మండలం, పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య వంటి విలువలను సమాజానికి అందించి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు.

అంతేకాకుండా సమాజంలో అంటరానితనం నిర్మూలనకు, వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారు చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అవుతుందని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు

ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, చెరుకూరి రవికుమార్,పోరుమామిళ్ళ టీడీపీ మండల అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్,అరవ శ్రీనివాసులురెడ్డి, రమణ రెడ్డి,ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య,ఓబుల రెడ్డి పాలకొండు రాజశేఖర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చండ్రాయుడు, రంగసముద్రం మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ చిన్న వెంకట సుబ్బయ్య,కడప జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు జహంగీర్ భాష, మాచుపల్లి కృష్ణారెడ్డి, బోవిళ్ళ నరసింహారెడ్డి, గోపిరెడ్డి పఠాన్ మౌలాలి,చంద్రగిరి ప్రహ్లాద్ రెడ్డి, PACS చైర్మన్ కల్లూరి దుగ్గిరెడ్డి, బిజీవేముల రమణారెడ్డి,సిమెంట్ సుబ్బారెడ్డి,గంగిపోగు నరసింహులు,గురుప్రసాద్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, బ్రహ్మదండ శ్రీనివాసులు, కోటపాటి పెంచలయ్య, రహమతుల్లా మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాళ్లపల్లి గిరి, గాజులపల్లి రవి, ప్రసాదు, గులాం గౌస్, పీరా, కమల్ భాష, చాంద్ బాషా, మొగల్ జిలాని, పగిడి సందీప్,మొగల్ పెద్ద రసూల్,sp షరీఫ్, సుబ్బారాయుడు యాదవ్, క్రిష్ణ ,షేక్ రఫీ,మనోజ్ నాయబ్,రఫీ, కోడూరు లక్ష్మీనారాయణ, రామయ్య, నరసయ్య, వెంకటసుబ్బయ్య, అన్నపురెడ్డి వెంకటసుబ్బయ్య,తుపాకుల ప్రసాద్, ఆఫీజ్, గాజుల వెంకటసుబ్బయ్య,దేవినేని వెంకటసుబ్బరెడ్డి, వై భాస్కర్ రెడ్డి, సాయి బాలచంద్ర, పుల్లయ్య, నగిరి రమణయ్య, రాజేష్ , సాయికుమార్ , సుధాకర్, వలి,ధర్మవరపు సుబ్బయ్య, గోవిందాయపల్లి బాలు, చెన్నకేశవ నాయుడు, మిట్ట వంశీ, చెన్నయ్య,గోపాల్, ,కోనేటి కేశవ,సాయి, ప్రభు, మొగల్ జిలాని,బొజ్జ చిన్నబాబు,చిన్నప్ప, ఆకాష్,బాల కొండయ్య ,కలవకూరి సురేంద్ర, తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.