డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి ఘన నివాళి. మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి.
గజ్వేల్, ఏప్రిల్ 5, ప్రజావాణి దేశ చరిత్రలో సామాన్యుడిగా పుట్టిన మహానుభావులలో బాబు జగ్జీవన్ రామ్1908లో బీహార్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన జగ్జీవన్ రామ్. మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే కుల వివక్షను అనుభవించారు. కానీ ఆ అవమానాలు ఆయనను కుంగదీసినవి కాదు — కదిలించాయి, పోరాటానికి ప్రేరేపించాయి. విద్య ద్వారా, ఆలోచన ద్వారా, ధైర్యం ద్వారా ఆయన ఎదిగారు.స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ మరియు జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహానేతలతో కలిసి ఆయన...