డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
పోచారం, జూన్ 18: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ సభ్యులు మాట్లాడుతూ, జూన్ 7న ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి, జూన్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 15న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తి చేశామని పేర్కొన్నారు. అన్ని...