prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 2:55 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

పోచారం, జూన్ 18: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ సభ్యులు మాట్లాడుతూ, జూన్ 7న ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి, జూన్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 15న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తి చేశామని పేర్కొన్నారు. అన్ని పదవులకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు ప్రకటించారు.

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా మడిశెట్టి రవీందర్, ఉపాధ్యక్షులుగా పడకంటి అశోక్, చాడ ఉషారాణి, ప్రధాన కార్యదర్శిగా ముత్తల వెంకటేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా విరమనేని దేవేందర్ రావు, గంధశ్రీ నాగరాజు, పెద్దిరెడ్డి స్వర్ణలత, ట్రెజరర్‌గా దెవరుప్పల శ్రీనివాస్, జాయింట్ ట్రెజరర్‌గా మంద సంపత్ కుమార్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పల్లె సాంబశివారెడ్డి, సామల విజయ్ భాస్కర్ రెడ్డి, పిన్నింటి చంద్రశేఖర్ రెడ్డి, మంచాల శ్రీనివాస్ రావు, ఆముల ప్రభాకర్, ఆకుల రమేష్ ఎన్నికయ్యారు.

సలహా, ఎన్నికల మరియు ఆడిట్ కమిటీ సభ్యులుగా బాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, సుందర్ రావు, శ్రీనివాసులు, వెంకట్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, నాగార్జున రెడ్డి, నరేందర్లను నియమించారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఎన్నికల కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు, నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.