డయల్-100 కాల్‌కు వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో ఉరివేసుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన చండూరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్

*డయల్-100 కాల్‌కు వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో ఉరివేసుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన చండూరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* చండూర్ పోలీస్ స్టేషన్‌ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్, విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ప్రదర్శించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. రాత్రి ఉడతలపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోందని డయల్-100 ద్వారా సమాచారం అందడంతో, విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ వెంటనే స్పందించి కేవలం 5 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు....