prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 1:35 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ట్రాఫిక్ సమస్యలు.. సైబర్ క్రైమ్ ఫై అవగాహన సదస్సు

ఎన్టీఆర్ జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15)ఇబ్రహీంపట్నం,కొండపల్లి,ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి.రాజశేఖర్ బాబు,ఐపీఎస్ ఆదేశాల మేరకు,సర్కిల్ ఇన్స్పెక్టర్,సుబ్రహ్మణ్యం, పర్యవేక్షణలో కొండపల్లి డి,ఏ,వి,స్కూల్ నందు ఇబ్రహీంపట్నం,సెయింట్ జేవియర్ స్కూల్ నందు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇబ్రహీంపట్నం,టౌన్ సెక్టార్,సబ్ ఇన్స్పెక్టర్,రవి వర్మ, కొండపల్లి సెక్టర్,సబ్ ఇన్స్పెక్టర్,చక్రధర్ రావు,అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ రవి వర్మ మాట్లాడుతూ,ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ క్రైమ్,డ్రగ్స్ మరియు మహిళలపై జరిగే నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థి,విద్యార్థినిలకు, ముఖ్యంగా సైబర్ క్రైమ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మకూడదని,ఎవరికి కూడా ఓటీపీ వివరాలు చెప్పవద్దని,“డిజిటల్ అరెస్ట్”అనే పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌కు భయపడవద్దని సూచించారు.అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెలియని లింకులు,ట్రేడింగ్ యాప్‌లు వంటి వాటిపై క్లిక్ చేయడం ద్వారా డబ్బులు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు,అవగాహన కల్పించారు.అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయకుండా,అందరూ బాధ్యతతో వ్యవహరించాలని తెలియపరిచారు.ట్రాఫిక్‌కు అడ్డంకులు కలిగించవద్దని సూచించారు.ప్రతి విద్యార్థి విద్యార్థినిలు మీ,మీ తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ గురించి మీ తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు.ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా వహించాలని ఈ సందర్భంగాసూచించారు.పోలీసు వారి ఆంక్షలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినిలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.