ట్యాక్స్ కలెక్షన్ మరియు అభివృద్ధి పనులపై సిబ్బందితో సమీక్ష సమావేశం,మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఏ. చంద్రమోహన్
ప్రజావాణిన్యూస్(మార్చి20) బద్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో బద్వేల్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఏ.చంద్రమోహన్ గారు మున్సిపాలిటీలో జరుగుతున్న ట్యాక్స్ కలెక్షన్ మరియు అభివృద్ధి పనులపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ట్యాక్స్ వసూళ్ల పురోగతిని సమీక్షిస్తూ,పెండింగ్ బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు.మార్చి 30 లోపు పన్ను చెల్లించినట్లయితే వడ్డీలో 50% రాయితీ పొందవచ్చునని,ఈ అవకాశాన్ని బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అలాగే సిబ్బంది తమ పరిధిలో 100% పన్నులు వసూలు చేయాలని స్పష్టం చేస్తూ,లక్ష్యాలు సాధించకపోతే...