టైం టేబుల్ బోర్డు తీసేసిన సిబ్బంది .9 గంటలకు రావాలని రాసి… సాయంత్రానికి మాయం. .DM&HO చర్యలు తీసుకుంటామని హామీ.
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* గోవిందరావుపేట మండలం పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది ఉదయం 9 గంటలకు రావాలని రాసి ఉన్న టైం టేబుల్ బోర్డు ఫోటోను స్థానికులు తీశారు. కానీ అదే రోజు సాయంత్రానికి ఆ బోర్డును సిబ్బంది తీసేశారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి DM&HO ని చరవాణి ద్వారా వివరణ కోరగా, ఆయన స్పందిస్తూ ఎవరైతే టైం టేబుల్ బోర్డు తీశారో వారిపై చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రి సిబ్బంది...