prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:26 am Digital Edition : SRIKANTH MULUGU

టైం టేబుల్ బోర్డు తీసేసిన సిబ్బంది .9 గంటలకు రావాలని రాసి… సాయంత్రానికి మాయం. .DM&HO చర్యలు తీసుకుంటామని హామీ.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

గోవిందరావుపేట మండలం
పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.
శుక్రవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది ఉదయం 9 గంటలకు రావాలని రాసి ఉన్న టైం టేబుల్ బోర్డు ఫోటోను స్థానికులు తీశారు. కానీ అదే రోజు సాయంత్రానికి ఆ బోర్డును సిబ్బంది తీసేశారు.
ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి DM&HO ని చరవాణి ద్వారా వివరణ కోరగా, ఆయన స్పందిస్తూ ఎవరైతే టైం టేబుల్ బోర్డు తీశారో వారిపై చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రి సిబ్బంది ఉదయం 9 గంటలకు రాకపోతే వారిపైనా చర్యలు ఉంటాయి”_ అని తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంతో పసర, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు సమయానికి వచ్చినా డాక్టర్ ఉండకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

*గ్రామస్తుల డిమాండ్*
వెంటనే పసర ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని సమయపాలన కచ్చితంగా అమలు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

*బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ*