టీసీఏ వార్షిక సదస్సులో డా. సి. మల్లేశకు ప్రథమ ఉత్తమ పరిశోధనా పత్రం పురస్కారం

ఘట్‌కేసర్, జూన్ 26 (ప్రజావాణి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న డా. సి. మల్లేశ ప్రతిష్ఠాత్మక తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (టీసీఏ) నిర్వహించిన ఏడవ వార్షిక సదస్సులో ప్రథమ ఉత్తమ పరిశోధనా పత్రం పురస్కారాన్ని అందుకున్నారు. “వికసిత భారత్–2047: కృత్రిమ మేధస్సు యుగంలో వాణిజ్యం మరియు నిర్వహణలో నూతన దృక్కోణాలు” అనే అంశంపై జూన్ 25న వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ వాణిజ్య, వ్యాపార నిర్వహణ కళాశాల ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. మల్లేశ “కృత్రిమ...