prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 1:44 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

టీడీపీ నూతన కార్యవర్గానికి డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శుభాకాంక్షలు

ఒంగోలు జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన శ్రీ నారా లోకేష్.కనిగిరి శాసనసభ్యులు,ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి.హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి,పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు.తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత సముచితమైనదని ఆయన హర్షం వ్యక్తం చేశారు.శ్రీ నారా లోకేష్.డైనమిక్ నాయకత్వంలో పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అదేవిధంగా,పార్టీలో నూతన బాధ్యతలు చేపట్టిన పలువురు కీలక నాయకులకు డా.ఉగ్రనరసింహారెడ్డి.ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సేవలందిస్తూ.టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన శ్రీ నూకాసాని బాలాజీ,ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతూ టీడీపీ జోనల్కో ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీ దామచర్ల సత్య.ప్రభుత్వ విప్,కుప్పం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్,గౌరవ ఎమ్మెల్సీగా విశేష సేవలందిస్తూ.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ కంచర్ల శ్రీకాంత్.ఆయన హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నలుగురు నాయకులు తమ అపార అనుభవంతో,ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.మార్గదర్శకత్వంలో,సరికొత్త వ్యూహాలతో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసి,తెలుగుదేశం పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని డా.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి.ఆకాంక్షించారు.