prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 5:25 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

టీడీపీ కోసం చెమటోడ్చిన కార్యకర్తలకు ఇదేనా గుర్తింపు

మ‌హానాడుకు టీడీపీ నాయ‌కులకు పిలుపులేక‌పోవ‌డం బాధేసింది
వైసీపీ నుంచి వ‌చ్చిన వారికే అంద‌లం ఎక్కిస్తున్నారు
కాశినాయ‌న  జూన్ 5 ప్రజావాణి మండ‌లంలో టీడీపీ శ్రేణుల ఆత్మ‌గౌర‌వ స‌మావేశం,తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టకాలంలో సైతం అండగా నిలిచిన కార్యకర్తలను పక్కనపెట్టి, ఇటీవల పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించడం టీడీపీ శ్రేణులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని కాశినాయన మండల టీడీపీ నాయకులు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ పండుగ‌లా చేసుకునే మ‌హానాడుకు కాశినాయ‌న మండ‌లం నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లకు పిలుపు లేక‌పోవ‌డంతో టీడీపీ శ్రేణులు బాధ‌తో ఈ ఆత్మ‌గౌర‌వ స‌భ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు.పార్టీ అధికారంలో లేకపోయినా గ్రామాలు,బూత్‌లు, మండలాల స్థాయిలో పార్టీ జెండాను మోస్తూ, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసిన‌ట్లు గుర్తు చేశారు.నాయకుల పర్యటనలు, సభలు, నిరసన కార్యక్రమాల్లో అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను పూర్తిగా విస్మరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పార్టీ కోసం తమ సమయాన్ని,శ్రమను, సొంత ధనాన్ని వెచ్చించిన కార్యకర్తలకు కనీస గౌరవం కూడా దక్కకపోవడం బాధాకరమన్నారు.ఇటీవల మహానాడు నిర్వహణ బాధ్యతలను కొంద‌రు వ్య‌క్తుల‌కు అప్పగించడం పట్ల కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.గత ఎన్నికల్లో ఆయన పార్టీ కోసం ఎక్క‌డైనా పనిచేశారా ప్ర‌శ్నించారు.రైతు పోరు సభలు,యువగళం పాదయాత్ర,బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలు,చంద్రబాబు నాయుడు,మరియు నారా లోకేష్ప ర్యటనలు,పార్టీ చేపట్టిన వివిధ పోరాట కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఏమిటో స్పష్టం చేయాలని కోరారు.ఒక్క‌సారి కూడా గ‌త ప్ర‌భుత్వం నిర‌స‌న గ‌ళం వినిపించింది లేద‌న్నారు.పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారిని పక్కనబెట్టి,కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల కింది స్థాయ నాయకులు,కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటోందన్నారు.గ్రామ కమిటీలు,మండల నాయకత్వం,క్లస్టర్ ఇన్‌చార్జీలకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.వారికి స‌మాచారం ఇవ్వ‌కుండానే బీఎల్ఏ ల‌ను మార్చుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.ఎన్నో ఎళ్లుగా పార్టీ కోసం ప‌ని చేసిన వారిని ప్ర‌క్క‌కు పెట్టి వైసీపీ నుంచి వ‌చ్చిన వారికి ప్రాధాన్య‌త ఇవ్వడం సరికాద‌న్నారు.తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పలుమార్లు పేర్కొన్నారని గుర్తుచేసిన నాయకులు,కార్యకర్తల మనోభావాలను గౌరవించేలా పార్టీ వ్యవహరించాలని కోరారు.బద్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించి, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తల సేవలను గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాశినాయన మండల టీడీపీ నాయకులు పేర్కొన్నారు.ఈ స‌భ‌లో కాశీనాయన మండలాధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి,కాశి నాయన మండల సొసైటీ చైర్మన్ ముర్కుటి గురువి రెడ్డి,మండల సీనియర్ నాయకులు కొండా దుగ్గిరెడ్డి,మాజీ మండలాధ్యక్షులు రమణారెడ్డి,మండల క్లస్టర్ ఇంచార్జ్ లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి,నరసాపురం మాజీ సర్పంచ్ చిన్న ఖాజావలి,కోడిగుడ్లపాడు మాజీ సర్పంచ్ సోమశిల బాల గురవయ్య, మాజీ ఎంపీటీసీ పోల్ రెడ్డి సీనియర్ నాయకులు దీన్నేపు కృష్ణారెడ్డి,కొండా నరసింహారెడ్డి,అక్కి రమణారెడ్డి,కరుణాకర్,ఈశ్వర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి,మండల కార్యదర్శి సుబ్బారావు, కల్లూరు శ్రీనివాసరెడ్డి,రామచంద్ర నాయుడు, వేణుగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి,అశోక్ విద్యా సంస్థ‌ల అధినేత అమ‌ర్‌నాథ్ రెడ్డి, తిరుపాలయ్యలతో సోసైటీ చైర్మ‌న్లు మాజీ స‌ర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,నీటి సంఘాల చైర్మ‌న్లు పాటు పెద్ద ఎత్తున నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు