టీజీపీఎస్సీ ఫీజుల పెంపు నిరుద్యోగులపై ఆర్థిక భారం: ఏఐవైఎఫ్
హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇటీవల వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. పెంచిన ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో అదనపు కార్యదర్శి సరితకు ఏఐవైఎఫ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ, గతంలో రూ.200గా...