prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 3:18 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

టిీజీఎల్‌డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఘట్‌కేసర్ కాంగ్రెస్ నేతలు

ఘట్‌కేసర్, మే 13 (ప్రజావాణి): తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ( టీ జి ఎల్ డి ఏ) చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు స్వీకరించిన చరణ్ కౌశిక్ యాదవ్ ని ఘట్‌కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

టిీజీఎల్‌డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజా సేవలో మరింత ఉన్నత స్థానానికి చేరుకొని ప్రజలకు విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కే. వినోద్ కుమార్, పోచారం మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్ర రాజు, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.