prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:36 pm Digital Edition : SHEKARREDDY PATANCHERUV

టిడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు సహాయ కార్యదర్శిగా బక్కోల్ల రాము ఏకగ్రీవ ఎన్నిక

•టిడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు సహాయ కార్యదర్శిగా బక్కోల్ల రాము ఏకగ్రీవ ఎన్నిక

*నూతన కమిటీపై కృతజ్ఞతలు తెలిపిన రాము.. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని వెల్లడి

పటాన్‌చెరు,ఆగస్టు 6(ప్రజావాణి):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ గురువారం పటాన్‌చెరు ఐబీ అతిథి గృహంలో నిర్వహించిన మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడు బాదిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేటి దినపత్రిక పటాన్‌చెరు రిపోర్టర్ బక్కోల్ల రామును టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా బక్కోల్ల రాము మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి సహాయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, సహచర జర్నలిస్టులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్, రాష్ట్ర నాయకులు మేకల కృష్ణయ్య, ప్రభు, జాతీయ కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి, నూతన నియోజకవర్గ అధ్యక్షుడు బాదిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యం, సహాయ కార్యదర్శులు గిరి, ప్రసాద్, కృష్ణాగౌడ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సంఘ బలోపేతం కోసం నిబద్ధతతో పనిచేస్తానని రాము పేర్కొన్నారు. సహచర పాత్రికేయులందరి సహకారంతో టిడబ్ల్యూజేఎఫ్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.