prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 9:26 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

కడప జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11) బద్వేలు టౌన్ సిద్ధవటం బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన మహానుభావుడు, సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి  బద్వేలు టౌన్ సిద్ధవటం రోడ్డులోని పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా పూలే గారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాన హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. సమాజంలో కుల వివక్షను నిర్మూలించి సమానత్వాన్ని నెలకొల్పడంలో ఆయన చేసిన సేవలు అపారమని తెలిపారు.అలాగే, తన సహచరిణి సావిత్రీబాయి పూలే గారితో కలిసి 1848లో బాలికల కోసం దేశంలోనే తొలి పాఠశాలను స్థాపించి మహిళా సాధికారతకు బాటలు వేసారని కొనియాడారు.మహాత్మా పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,ఓబుల రెడ్డి రమణ రెడ్డి,బద్వేలు మున్సిపాలిటీ టిడిపి మాజీ అధ్యక్షుడు కొంకుల రాంబాబు,కడప జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు జహంగీర్ భాష,మాచుపల్లి కృష్ణారెడ్డి,ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య,బిజీవేముల చంద్రశేఖర్ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,బోవిళ్ళ నరసింహారెడ్డి, ఓబుల్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి , చిన్నప్పు రెడ్డి, పఠాన్ మౌలాలి,రసూల్,పాటూరు నరసింహ రెడ్డి,సిమెంట్ షరీఫ్,భాస్కర్ నాయుడు,నరసింహ రెడ్డి, గంగిపోగు నరసింహులు,ఉపత్తి సుబ్బా రెడ్డి,గురుప్రసాద్ రెడ్డి,గంగాధర్ రెడ్డి,నవీన్ కుమార్ రెడ్డి,బ్రహ్మదండ శ్రీనివాసులు, కోటపాటి పెంచలయ్య,అందురు వెంకట సుబ్బా రెడ్డి, తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.