prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 1:18 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జైభీమ్ రావ్ భారత్ పార్టీకి ‘రామప్ప’ సెగ.. అనంతపురంలో ఖాళీ అయిన పార్టీ కేడర్!” పార్టీ సభ్యతానికి రాజీనామా చేసిన తలమెల్ల సూర్యనారాయణ!

ప్రజావాణి న్యూస్(మార్చి20)అనంతపురం:-జైభీమ్ రావ్ భారత్ పార్టీలో విలువలు కనుమరుగయ్యాయని,కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని ధ్వజమెత్తుతూ పార్టీ కీలక నేత తరిమెల సూర్యనారాయణ తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఆయనతో పాటు జిల్లావ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కమిటీ సభ్యులు సామూహిక రాజీనామాలు సమర్పించి పార్టీకి షాక్ ఇచ్చారు.ఈ సందర్భంగా పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ తీరుపై తరిమెల సూర్యనారాయణ సంధించిన నిశిత విమర్శలు ఇవే సొంత జేబు నుంచి ఖర్చులు.అధిష్టానం సాయం’సున్నా’అనంతపురం జిల్లాలో పార్టీ ఉనికి ఉందంటే అది ఆదివాసి బిడ్డ రామప్ప నాయక్ చలవే.నెలకు రూ. 8,000 అద్దె,కరెంట్ బిల్లులు,పార్టీ జెండాలు,కండువాల వరకు అన్నీ ఆయన తన సొంత డబ్బులతోనే సమకూర్చుకున్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించని పార్టీ అధిష్టానం,ఏ ముఖం పెట్టుకొని నాయకులపై పెత్తనం చే,ప్రశ్నించారు.ప్రోటోకాల్‌కు తిలోదకాలు,అవమానకరంగా ఉద్వాసన”కనీస సమాచారం లేకుండా,ఫోన్ కాల్ కూడా చేయకుండా పదవుల నుంచి తొలగించడం జైభీమ్ రావ్ భారత్ పార్టీలో పెచ్చుమీరిన అరాచకానికి నిదర్శనం.ఫిబ్రవరిలో నియామక పత్రం ఇచ్చి,నెల తిరగక ముందే రామప్ప నాయక్ రాజీనామా చేయకుండానే బాధ్యతల నుంచి తప్పించడం అత్యంత దారుణం.ఇదేనా మీరు కార్యకర్తలకు ఇచ్చే గౌరవం,అంటూ నిలదీశారు.దళిత,గిరిజన బిడ్డలపై వివక్షా,పార్టీ కోసం రక్తం,చెమట ధారపోసిన గిరిజన బిడ్డలను కేవలం వాడుకొని వదిలేస్తారా,పార్టీ కోసం కష్టపడని వ్యక్తులకు రాష్ట్ర కార్యదర్శి,జిల్లా కోఆర్డినేటర్ పదవులు కట్టబెట్టడం వెనుక మర్మమేంటి? ఇది దళిత,గిరిజన నేతలపై జరుగుతున్న  స్పష్టమైన వివక్ష కాదా,అని ఆవేదన వ్యక్తం చేశారు.ఖాళీ అవుతున్న పార్టీ.గత అనుభవాల నుంచి పాఠాలు లేవా,సోమన్న మురళి గౌడ్,ఆచారి గోవిందు,సూరిబాబు,ఏసన్న,మారుతి,నాగరాజు,వెంకటేశులు,సువర్ణ,రమేష్,గౌసియా వంటి ఎందరో బలమైన నేతలను అవమానకరంగా పక్కన పెట్టడం వల్లే 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరూ నేడు పార్టీలో లేరని గుర్తు చేశారు.రామప్ప నాయక్ రాజీనామాతో అనంతపురం జిల్లాలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ బోర్డు తిప్పేసినట్లేనని స్పష్టం చేశారు.ఆత్మగౌరవం లేని చోట,కార్యకర్తల కష్టానికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండటం ఇష్టం లేకనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం.రామప్ప నాయక్ కు జరిగిన అన్యాయం రేపు మరో కార్యకర్తకు జరగకూడదనే రాజీనామా చేస్తున్నానని.తరిమెల సూర్యనారాయణ పేర్కొన్నారు