జైపూర్ మండలంలో భారీ వర్షాలు

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో, ఎంపీఓ పిలుపు జైపూర్, జూలై 29,ప్రజావాణి: గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జైపూర్ మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ఎంపీడీవో జి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) శ్రీపతి బాపురావు కోరారు. బుధవారం మండలంలోని పలు వర్ష ప్రభావిత గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. **స్తంభించిన...