జూలై నెలలో చేప పిల్లలు ఇవ్వకుంటే ముదిరాజ్ సంఘం సభ్యులతో కలిసి ఆసెంబ్లీ నీ ముట్టడిస్తాం -కొరివి తిరుపతి ముదిరాజ్

  బెజ్జంకి జూన్ 29 (ప్రజావాణి) తెలంగాణలో గత రెండేళ్లుగా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు, సబ్సిడీ వాహనాలు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకుడు కొరివి తిరుపతి ముదిరాజ్ ఆరోపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో చెరువుల అభివృద్ధితో పాటు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించారని, ప్రస్తుతం ఆ పథకాలను నిలిపివేయడం వల్ల మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.ఈ ఏడాది జూలైలోనే రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో...