prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 1:35 pm Digital Edition : RAJASHEKARREDDY

జూలై నెలలో చేప పిల్లలు ఇవ్వకుంటే ముదిరాజ్ సంఘం సభ్యులతో కలిసి ఆసెంబ్లీ నీ ముట్టడిస్తాం -కొరివి తిరుపతి ముదిరాజ్

 

బెజ్జంకి జూన్ 29 (ప్రజావాణి)

తెలంగాణలో గత రెండేళ్లుగా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు, సబ్సిడీ వాహనాలు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకుడు కొరివి తిరుపతి ముదిరాజ్ ఆరోపించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో చెరువుల అభివృద్ధితో పాటు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించారని, ప్రస్తుతం ఆ పథకాలను నిలిపివేయడం వల్ల మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.ఈ ఏడాది జూలైలోనే రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో ఉచిత చేప పిల్లలను విడుదల చేసి, పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ వాహనాలను వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ చేయలేని పరిస్థితి ఉంటే, ఆ నిధులను నేరుగా మత్స్య సహకార సంఘాల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.