జూన్ 9 ధర్నాను జయప్రదం చేయాలి – సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు

పోలవరం జూన్ 5 ప్రజావాణి మండలం వింజరం గ్రామంలో నిర్వహించిన సిపిఎం విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం వల్ల సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రజలపై పన్నుల భారం మోపుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను...