*
*ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా జరుపుకోవాలి*
*ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ శ్రేణులకు మండల నాయకత్వం పిలుపు*
*జులై 7న మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు*
*ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు పడిశాల నాగేశ్వరరావు మాదిగ*
*మన ప్రజావాణి మధిర ఆర్ సి జూలై 4*
ముదిగొండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో జూన్ 7 ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరగబోయే కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి శ్రేణులు ఎమ్మార్పీఎస్ జెండాలతో మానవహారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎం ఎస్ పి ముదిగొండ మండల అధ్యక్షుడు పడిశాల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూన్ 7న జరగబోయే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలో ఉన్న ప్రతి గ్రామములో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయాలని అదే రోజున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు జరపాలని ప్రతి ఎం ఎస్ పి ఎమ్మార్పీఎస్ కార్యకర్త ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గూడూరు వీరస్వామి మాదిగ,కొలిక పొంగు వెంకటరావు మాదిగ,ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు పడిశాల నాగేశ్వరరావు మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బొడ్డు అనిల్ మాదిగ, విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు గుంజులూరి రాంబాబు మాదిగ, మేడేపల్లి గ్రామ అధ్యక్షుడు బొడ్డు శ్రీను మాదిగ, కట్టకూరి రాంప్రసాద్ మాదిగ, ఎస్ కే సైదా పాషా తదితరులు పాల్గొన్నారు.
