జుక్కల్ మహాదేవ్ ఆలయం వద్ద ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

జుక్కల్ మహాదేవ్ ఆలయం వద్ద ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం జుక్కల్, మార్చి 07 (ప్రజావాణి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని మహాదేవ్ ఆలయం సమీపంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారి స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఆలయం వద్ద ఉన్న చెట్టుకు చెందిన కొమ్మ విరిగి విద్యుత్ లైన్‌పై పడటంతో వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ ఘటన జరిగి మూడు రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు....