prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 5:14 am Digital Edition : PRAJA VANI

జుక్కల్ మండలంలోని గ్రామాలలో ప్రజాపాలన గ్రామసభలు<br><br><br>మన  ప్రజావాణి ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి ఏప్రిల్ 02<br>

జుక్కల్ మండలంలోని గ్రామాలలో ప్రజాపాలన గ్రామసభలు

మన  ప్రజావాణి ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి ఏప్రిల్ 02

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామసభలను ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో సర్పంచ్సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే వేదికగా గ్రామసభలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.అలాగే గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని అభిప్రాయపడ్డారు.ఈ గ్రామసభల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని అధికారులు నమోదు చేసి దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్ నాయక్,ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపిఓ రాము పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.