జుక్కల్‌లో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం
పరిశుభ్రతపై అవగాహన కల్పించిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్
జుక్కల్, మార్చి 07 (ప్రజావాణి):
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో శనివారం ప్రజా పాలన కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభోత్సవంలో గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా జుక్కల్ బస్టాండ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త చెదరాన్ని తొలగించి శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రాజు, బిల్ కలెక్టర్ మనోజ్ కుమార్, గ్రామ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.