prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 3:05 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జిల్లా లో రాత్రి పూట ముమ్మరంగా వాహన తనిఖీలు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్

వై.ఎస్.ఆర్ కడప జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)జిల్లాలో రాత్రి పూట ముమ్మరంగా వాహన తనిఖీలు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్(నాకాబందీ) లు నిర్వహించాలి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ మరింత బలోపేతం శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించి పోలీస్ అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్  జిల్లాలో నేరాల నిరోధానికి రాత్రి పూట ముమ్మరంగా వాహన తనిఖీలు,కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్(నాకాబందీ)లు నిర్వహించాలని జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పోలీస్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎలాంటి నేరాలకు తావులేకుండా గస్తీపై నిఘా పెంచాలని ఆదేశించారు. గంజాయి సేవించే వారిపై,విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా మద్యం విక్రయించే బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాత్రిపూట రోడ్లపై అనవసరంగా తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.హోటల్స్, తోపుడు బండ్లు, షాపు లు రాత్రి 10:30 కల్లా మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత సమయంలోగా అనగా రాత్రి 10 గంటల తర్వాత షాపులు తెరచి ఉంచితే కఠినంగా వ్యవహారించాలన్నారు.వైన్ షాపులను రాత్రి 10 గంటల తర్వాత తెరచి ఉంచితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైన్ షాపులు,బార్ లలో సి.సి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పనిచేసేలా తగిన చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు చెప్పాలని,సి.సి కెమెరాల వీడియో బ్యాకప్ నిల్వ ఉండేలా చూడాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా రాత్రి పూట, పగటి పూట గస్తీ పెంచాలని ఎస్.పీ ఆదేశించారు.రౌడీ, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్.పీ (అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు,స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పీ శ్రీ ఎన్.సుధాకర్ గారు,కడప ఇంచార్జ్ డి.ఎస్.పీ బాలస్వామి రెడ్డి, జిల్లాలోని సి.ఐ లు,ఎస్.ఐ లు, పాల్గొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.