prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:19 am Digital Edition : PRAJA VANI

జిల్లా మత్స్య శాఖలో జీవోల లొల్లి

జిల్లా మత్స్య శాఖలో జీవోల లొల్లి…?

*33 కులాల జీవోను విస్మరించేందుకు ఖమ్మం జిల్లాలో ప్రయత్నం…?

*జిల్లా రాష్ట్రస్థాయిలో అందుతున్న వినతి పత్రాలు ఫిర్యాదులు…?

*ఉమ్మడి రాష్ట్రం జీవోలను పరిగణలోకి తీసుకుంటా..

*మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లేశం వివరణ

*నాడు వైరాలో ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు..?

*నేడు జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు…?

*తెర వెనుక అదృశ్య శక్తులు అండదండలతో నమోదుకు కసరత్తు…!

మన ప్రజావాణి ప్రత్యేక కథనం…1

ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోల ప్రకారం మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని 33 కులాలకు చెందిన అర్హులైన మత్స్యకారులకు ప్రధానంగా సొసైటీలలో సభ్యత్వం కల్పించాలని గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా మొదలు తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల మత్స్య సొసైటీల సంఘాల చీఫ్ ప్రమోటర్స్ వివిధ రూపాలలో సమస్యల సాధనకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఆయా జిల్లాలలో మత్స్య శాఖ సహాయ సంచాలకు వినతి పత్రాలు విజ్ఞప్తులు అందజేశారు. అనంతరం మత్స్య శాఖ కమిషనర్ కు జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ కు చీఫ్ ప్రమోటర్స్ వినతి పత్రాలు అందించినట్లు సమాచారం. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో నాడు మత్స్య శాఖ అధికారులుగా వ్యవహరించిన అధికారులు వైరా ముంపు బాధితుల పేరుతో ఇష్టానుసారంగా సభ్యత్వాలు కల్పించినట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మధిర నియోజకవర్గం చింతకాని మండలం వందనం కొణిజర్ల మండలం తనికెళ్ల సంఘాలలో సభ్యత్వాల కోసం ఇటీవల డిమాండ్లు వస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో కూడా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కాగా ఇటీవల ఖమ్మం జిల్లాలో కొన్ని సంఘాలలో నిబంధనలకు విరుద్ధంగా మత్స్యకారులను నమోదు చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నట్లు దానికి మత్స్య శాఖ జిల్లా రాష్ట్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం మత్స్య సొసైటీల జిల్లా ఎన్నికలు నిర్వహించలేదని ప్రత్యామ్నాయంగా ఆయా జిల్లాల మత్స్య సొసైటీల సంఘం తరఫున చీఫ్ ప్రమోటర్స్ నియమించినట్లు సమాచారం. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులను నియమించకపోవడంతో చీప్ ప్రమోటర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా కొంతమంది గతంలో పనిచేసిన అధికారులు జిల్లా కేంద్రంలోని కొందరు సహాయంతో వివిధ సంఘాలలో నిబంధనలకు విరుద్ధంగా మత్స్యకారులను నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. జిల్లా మత్స్య శాఖ అధికారులు గత ప్రభుత్వ హయాములో ఇచ్చిన జీవోల ప్రకారం మత్స్య సొసైటీలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించి మత్స్యకారుల జీవనోపాధికి దోహదం చేయాలని పలువురు మత్స్యకారులు కోరుతున్నారు..

మరికొన్ని సమగ్ర వివరాలతో ఆధారాలతో…2లో వేచి చూడండి…!