జిల్లా మత్స్యశాఖ అధికారిని మర్యాద పూర్వకంగా కలిసిన గుగ్గిళ్ల గ్రామ ముదిరాజ్ సభ్యులు
బెజ్జంకి,జూలై 11(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సొసైటీ గ్రామ అధ్యక్షుడు చిట్టి కనుకయ్య ఆధ్వర్యంలో గ్రామ ముదిరాజ్ నాయకులు సిద్దిపేట జిల్లా మత్స్యశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) రాజారామ్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలపై కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిట్టి రాజు, కొత్తూరు కుమార్, అంజి తదితరులు పాల్గొన్నారు.